వీడిన విజయవాడ బాక్స్ మిస్టరీ!
- మంగళగిరికి తరలించిన బాంబ్ స్క్వాడ్
- రాగి బిందె, బ్యాటరీ, వైర్ల గుర్తింపు
- పోలీస్ కమిషనరేట్‌కు తరలింపు
అయితే ముందుగా భయపడినట్టుగా బాక్సులో పేలుడు పదార్థాల్లాంటివేమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాక్సులో ఓ రాగి బిందె, బ్యాటరీ, వైర్లు ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే బాక్సులో లభించిన వస్తువులను విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. అయితే బాక్సులో లభించిన వస్తువులను ఎందుకు కొన్నారు? వాటిని ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయాలపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు.