Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియా వారియర్ 'లవర్స్ డే' చీఫ్ గెస్టుగా అల్లు అర్జున్

  • మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్'
  • తెలుగు అనువాదంగా 'లవర్స్ డే'
  • ఫిబ్రవరి 14వ తేదీన సినిమా విడుదల
మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్' సినిమా చేస్తుండగానే .. ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దాంతో మలయాళంతోపాటు తమిళ .. తెలుగు .. హిందీ భాషల నుంచి ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆమె డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు అనువాదంగా తీసుకురానున్నారు.'లవర్స్ డే' పేరుతో ఈ సినిమాను తెలుగులో ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ఆడియో వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 23వ తేదీ (బుధవారం) సాయంత్రం 6 గంటల నుంచి జెఆర్సీ కన్వెన్షన్లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మొదలుకానుంది. ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రావడం వలన, తమ ప్రాజెక్టుపై క్రేజ్ మరింత పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
priya varrier

More Telugu News