మంచిర్యాలలో దారుణం.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని కులం నుంచి వెలి!
- వార్డు సభ్యుడిగా యువకుడి పోటీ
- నామినేషన్ వెనక్కి తీసుకోమన్న కుల పెద్దలు
- వినకపోవడంతో కులం నుంచి బహిష్కరణ
అతడు నామినేషన్ వేసిన తర్వాత ఏం జరిగిందో కానీ కులపెద్దలు అతడిని పిలిపించి మందలించారు. నామినేషన్ను వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి చేశారు. అయినప్పటికీ మహేందర్ వెనక్కి తగ్గకపోవడంతో కుల పెద్దలు సమావేశమయ్యారు. మహేందర్ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నట్టు తీర్పు చెప్పారు. కులం నుంచి అతడిని బహిష్కరించామని, అతడితో ఎవరైనా మాట్లాడినా, లేదంటే అతడు ఎవరితోనైనా మాట్లాడినా జరిమానా విధిస్తామని తీర్పు చెప్పారు.