ఈ సందేశం చూస్తావని ఆశిస్తున్నా.. ఒక్కసారి కాల్ చెయ్యి: అన్నయ్య కోసం పాయల్ రాజ్‌పుత్ ఎదురుచూపులు
- నా సోదరుడు కనిపించక మూడేళ్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
- మేమంతా నీ కోసం ఎదురు చూస్తున్నాం
‘‘నా సోదరుడు కనిపించట్లేదు! ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య. నువ్వు ఈ సందేశం చూస్తావని ఆశిస్తున్నా. నువ్వు ఎక్కడైనా చిక్కుకు పోయి ఉంటే.. మాకు ఎలాగైనా ఒక్కసారి కాల్ చెయ్యి. మేమంతా నీకోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నోసార్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేదు’’ అని ట్వీట్ చేసిన పాయల్.. ‘ధృవ్‌ను కనిపెట్టండి’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేసింది.