పల్టీ కొట్టిన అక్రమ వలసదారుల బోట్లు.. మధ్యధరా సముద్రంలో 170 మంది గల్లంతు!
- ఇటలీ తీరం సమీపంలో ఘటన
- లిబియా, మొరాకో బోట్లు పల్టీ
- ప్రాణాలు దక్కించుకున్న ఓ వ్యక్తి
ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి తీరానికి ఈదుకుంటూ వచ్చాడనీ, అతనికి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రజలు మెరుగైన జీవితం కోసం యూరప్ దేశాలకు ఇలా అక్రమ మార్గాల్లో వెళుతుంటారు. అయితే చిన్నచిన్న పడవల్లో పరిమితికి మించి ఎక్కడంతో సముద్రంలో అవి బోల్తా పడుతుంటాయి. ఈ తరహాలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.