నెటిజన్ల దెబ్బకు ఇన్స్టాగ్రాం పోస్టునే మార్చేసిన బాలీవుడ్ నటి!
- సోషల్ మీడియాలో ‘10 ఇయర్ ఛాలెంజ్’ ట్రెండ్
- పదేళ్లంటూ ఇరవై ఏళ్లనాటి ఫోటోను షేర్ చేస్తావా? అంటూ విమర్శలు
- ‘20 ఇయర్ ఛాలెంజ్’గా మార్చేసిన మలైకా
ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అయింది. కానీ మలైకా మాత్రం ‘‘నా టెన్ ‘ఇయర్ ఛాలెంజ్’.. గత పదేళ్లు అద్భుతంగా ముగిశాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఎదురు చూస్తున్నా’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై నెటిజన్లు మండిపడ్డారు. ‘1998 నుంచి 2018 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియదా?’ అని ఒకరు ప్రశ్నిస్తే.. ‘పదేళ్లంటూ ఇరవై ఏళ్ల ఫోటోను షేర్ చేస్తావా?’ అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకరైతే ఏకంగా అందం ఉందే కానీ తెలివి లేదంటూ కామెంట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో మల్లిక తన ‘10 ఇయర్ ఛాలెంజ్’ను ‘20 ఇయర్ ఛాలెంజ్’గా మార్చింది.