ఐఆర్సీటీసీ హోటళ్ల కేసులో లాలూకు బెయిల్ మంజూరు
- 2006లో లాలూపై కేసు నమోదు
- రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన పటియాలా కోర్టు
- లాలూ కుటుంబీకులకు మధ్యంతర బెయిల్ పొడిగింపు
అయితే, లాలూకు రెగ్యులర్ బెయిల్ మంజూరు విషయమై ఈ నెల 28న తీర్పును ప్రకటిస్తామని న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఈరోజు మధ్యాహ్నం మరోసారి విచారించిన కోర్టు, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. లక్ష రూపాయల బెయిల్ బాండ్, ఒకరి పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, 2006లో ఐఆర్సీటీసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై లాలూ, ఆయన కుటుంబంపై సీబీఐ కేసు నమోదు చేసింది.