porn star: శృంగారతార పాత్రలో నటి రమ్యకృష్ణ

  • త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో ‘సూపర్ డీలక్స్’
  • ‘లీల’ అనే శృంగార తార పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ
  • ఈ చిత్రంలో లేడీ గెటప్ లో కనిపించనున్న విజయ్ సేతుపతి
ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటి రమ్యకృష్ణ. ప్రేమికురాలిగా, గృహిణిగా, చలాకీ అమ్మాయి వంటి పాత్రల నుంచి ‘బాహుబలి’లో శివగామి పాత్ర వరకు తన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి రమ్యకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఓ ఆసక్తికర పాత్రలో నటించేందుకు సాహసించింది. ఓ తమిళ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో ఆమె కనిపించనుంది.

ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘సూపర్ డీలక్స్’. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపించనుంది. ‘లీల’ అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ పాత్రలో నటించేందుకు తొలుత నటి నదియాను సంప్రదించగా, అందుకు ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ సినిమాకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించనున్నారు. సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుంది.
porn star
Tollywood
ramya krishna
vijay sethpathi
thayaga rajan

More Telugu News