ఫేస్బుక్ మెడకు భారీ జరిమానా ఉచ్చు: డేటా బ్రీచ్ ఆరోపణల ఎఫెక్ట్
- భారం రూ.16 వేల కోట్ల పైమాటే?
- యూజర్ల వ్యక్తిగత వివరాలు అమ్ముకుందని ఆరోపణలు
- ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎఫ్‌టీసీ
న్యూయార్క్ టైమ్స్ కథనం మేరకు ఫేస్‌బుక్‌కు దాదాపు రూ.16 వేల కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించవచ్చునని భావిస్తున్నారు. 2012లో గోప్యతా ఉల్లంఘనకు పాల్పడినందుకు గూగుల్‌పై ఎఫ్‌టీసీ ఇదే మొత్తం జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌పై విధించే జరిమానా అంతకంటే ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫేస్బుక్ యూజర్ల డేటా లీకైందని, ఇకపై అటువంటి పొరపాటు జరగకుండా చూస్తామని ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవడం తెలిసిందే. పత్రికల ద్వారా క్షమాపణలు కూడా తెలిపారు.