జగన్ పై దాడి కేసులో నేడు హైకోర్టులో పిటిషన్ వేయనున్న ఏపీ ప్రభుత్వం
- కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరం
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం
- నిన్న ముగిసిన శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ అభ్యర్ధన మేరకు అత్యవసర విచారణకు అనుమతిస్తే రేపు లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ నిన్ననే ముగిసింది. ఈరోజు అతడిని ఎన్ఐఏ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.