తెరపైకి హీరో సూర్య తనయుడు
- హీరోగా .. నిర్మాతగా సూర్య బిజీ
- త్వరలో చిన్నపిల్లల సినిమా
- ప్రధాన పాత్రలో సూర్య తనయుడు 'దేవ్'
మరికొన్ని నెలల్లో 'దేవ్' 9వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు. ఆ మధ్య సూర్య తమిళంలో పిల్లల సినిమా ఒకటి నిర్మించాడు (తెలుగులో 'మేము'). ఆ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదుగానీ, తమిళంలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అలాంటి సినిమానే మరొకటి నిర్మించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సినిమాలో ఆయన తనయుడు 'దేవ్' కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట.