Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చక్రి చనిపోయినప్పుడు శ్రావణిని చూసి తట్టుకోలేకపోయాను: సింగర్ కౌసల్య

  • చక్రి భార్య శ్రావణి మా చుట్టమే
  • లావైపోతున్నానని చక్రి అనుకునేవారు 
  • శ్రావణి భవిష్యత్తును తలచుకుని బాధపడ్డాను  
చక్రి సంగీత దర్శకత్వంలోనే కౌసల్య ఎక్కువ పాటలు పాడారు. కొన్ని పాటలు ఆమెకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి కౌసల్య ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చక్రి గురించిన ప్రశ్నకి ఇలా స్పందించారు.

"చక్రి సినిమాలకి నేను పాటలు పాడేదానిని గానీ .. ఆయన వ్యక్తిగత విషయాలపై నాకు పెద్దగా అవగాహనలేదు. చక్రి భార్య శ్రావణి .. మాకు చుట్టమే. చక్రి డైట్ గురించిన ప్రస్తావన శ్రావణి తెచ్చినప్పుడు, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది ఆమెకి నేను చెబుతూ ఉండేదానిని. చక్రి చనిపోయారని తెలియగానే నేను వెళ్లాను.

ఎదురుగా నాకు శ్రావణి కనిపించింది. శ్రావణి ఏడుస్తుండటం చూసి తట్టుకోలేకపోయాను. ఇంత చిన్న వయసులో ఆమెకి ఈ పరిస్థితి వచ్చిందే .. ఆమె భవిష్యత్తు ఏమిటి? అని తలచుకుని చాలా బాధపడ్డాను. లావైపోతున్నానని చక్రి అనుకునేవారు కానీ, ఆ టాపిక్ ని కొనసాగించేవారు కాదు" అని చెప్పుకొచ్చారు. 
sravani
kousalya

More Telugu News