'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!
- నిరాశ పరిచిన 'శ్రీనివాస కల్యాణం'
- వెంకీ కుడుములకి గ్రీన్ సిగ్నల్
- ఈ నెలలోనే సెట్స్ పైకి
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.