కాంగ్రెస్ నలుగురు గాంధీలనిస్తే.. బీజేపీ ముగ్గురు మోదీలనిచ్చింది: బీఎస్పీ నేత విజయ్ యాదవ్
- కాంగ్రెస్-బీజేపీపై బీఎస్పీ మూకుమ్మడి దాడి
- బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులేనన్న బీఎస్పీ నేత
- బీజేపీ తోక ముడవక తప్పదు
దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ అయిన కాంగ్రెస్ ఈ దేశానికి ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలను ఇస్తే.. బీజేపీ నరేంద్రమోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ఇచ్చిందన్నారు. బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులేనన్న విజయ్ యాదవ్.. బీజేపీ నేతలను తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి దెబ్బకు బీజేపీ తోకముడవక తప్పదన్నారు.