పశ్చిమ బెంగాల్లో దారుణం.. తల్లి ఒడి నుంచి చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి!
- తల్లి ఒడి నుంచి చిన్నారిని లాక్కెళ్లిన పులి
- భయంతో కేకలు వేసిన తల్లి
- తేయాకు తోటలో కనిపించిన చిన్నారి శరీర భాగాలు
కుమార్తెను కాపాడుకునేందుకు చిరుతను బెదిరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పూజ అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే వచ్చి చిన్నారి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం మదరిహత్లోని ఓ టీ తోటలో చిన్నారి శరీర భాగాలు కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.