హీరో విశాల్ కు కాబోయే భార్య ఈ అమ్మాయే!

  • ఫొటోను విడుదల చేసిన అనీషా
  • విశాల్ ను పెళ్లిచేసుకోబోతున్నట్లు వెల్లడి
  • అనీషా తండ్రి హైదరాబాదీ వ్యాపారవేత్త
ప్రముఖ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఆయన తండ్రి జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్ వివాహం జరగబోతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విశాల్ కు కాబోయే భార్య ఎలా ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా సంక్రాంతి వేళ ఈ సస్పెన్స్ కు అనీషా తెరదించింది.

విశాల్ తో దిగిన ఫొటోను విడుదల చేసిన అనీషా, త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనీషా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన అనీషా.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో నటించింది. కాగా, అనీషా ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Go Back to Shorts
kollywood
vishal
marriage
wife
anisha
Instagram]

More Telugu News