చదువు సంధ్యలు లేని వాళ్లే ఎక్కువ మందిని కంటారు: సుశీల్ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు
- అక్షరాస్యులకు సంతానంపై అవగాహన ఉంటుంది
- అది లేకే ఎక్కువ మందిని కంటున్నారు
- 2024 నాటికి చైనాను దాటేస్తాం
చదువుకున్న వారికి సంతానంపై అవగాహన ఉంటుందని, అది లేనివారే ఎక్కువమంది పిల్లల్ని కంటారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జనాభాలో భారతదేశం రెండో స్థానంలో ఉందని, 2024 నాటికి మన దేశం ఈ విషయంలో చైనాను మించిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి జనాభా నియంత్రణ విషయంలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతుల్ని చేయాలని, అది అక్షరాస్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సుశీల్ కుమార్ మోదీ అన్నారు.