యూపీలో ప్రారంభమైన కుంభమేళా.. పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు!
- భారీగా ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం
- మహాశివరాత్రి వరకూ కొనసాగనున్న వేడుకలు
- చిన్నారులు తప్పిపోకుండా ట్యాగ్ ల అందజేత
ఇందుకోసం యూపీ ప్రభుత్వం రూ.4,300 కోట్లను వెచ్చించనుంది. వాస్తవానికి ఈ వేడుకను అర్ధకుంభమేళాగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ యూపీ ప్రభుత్వం మాత్రం కుంభమేళాగానే చెబుతోంది. ఇందుకోసం గంగా-యమున నదీతీరాన 32,000 హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్ నగరి ప్రపంచంలోనే తొలి అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు సృష్టించింది. మరోవైపు కుంభమేళా సందర్భంగా తప్పి పోయిన పిల్లలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్)ట్యాగ్లను అందజేస్తున్నారు. వొడాఫోన్ సంస్థ సాయంతో దాదాపు 40,000 రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లు అందజేశారు.
ఆరు రోజులు.. అత్యంత పవిత్రం
త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించేందుకు ఆరు రోజులు పవిత్రమైనవి. అవి మకర సంక్రాంతి పర్వదినం కాగా, పౌష్ పూర్ణిమ(జనవరి 21), మౌని అమావాస్య(ఫిబ్రవరి 4), వసంత పంచమి(ఫిబ్రవరి 10), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 19), ఆఖరిది మార్చి 4వ తేదీ మహాశివరాత్రి. కాగా, వీటిలో మొదటి, ఆఖరి రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు స్నానం చేయడం శుభప్రదంగా చెబుతారు.