వచ్చే ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఎంత?.. సర్వే ప్రారంభించిన మోదీ ప్రభుత్వం
- ‘నమో’ యాప్ ద్వారా సర్వే
- అందరూ పాల్గొనాలని ప్రధాని పిలుపు
- ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వీడియో
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ‘నమో’ యాప్ ద్వారా ఈ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో బోలెడన్ని ప్రశ్నలు సంధించారు. సర్వేలో పాల్గొనాలంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వీడియోల ద్వారా దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తున్నారు. బీజేపీకి ప్రతికూలంగా ఉన్న చోట సిట్టింగ్ ఎంపీలను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు.