పిచ్చి పీక్ స్టేజికి.. వీడియో కోసం వేగంగా వెళుతున్న బస్సుకి వేలాడుతూ.. టైరుపై నిల్చున్న యువకుడు!

  • చూసిన వారి గుండె గుభేల్
  • వైరల్ అవుతున్న వీడియో
  • యువకుడి కోసం పోలీసుల వేట
యువతలో పెరుగుతున్న సెల్ఫీలు, వీడియోల పిచ్చికి ఇది పరాకాష్ట. ‘టిక్ టాక్’ వీడియో కోసం చెన్నైలో ఓ యువకుడు చేసిన సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. వేగంగా వెళుతున్న బస్సు కిటికీ పట్టుకుని వేలాడుతూ.. బస్సు టైరుపై కాళ్లు పెట్టి నిల్చున్నాడో యువకుడు. టైరు మధ్యలో కాలుపెట్టి నిల్చున్న యువకుడిని చూసి బస్సులో ఉన్నవారు కంగారుపడినా అతడు మాత్రం నవ్వుతూ వీడియోకు పోజిచ్చాడు.  

వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. టైరు మధ్యలో కాలుపెట్టి నిల్చున్న యువకుడి కోసం గాలించే పనిలో పడ్డారు. బస్సుకి వేలాడడమే ప్రమాదకరం అనుకుంటే, టైరుపై కాలుపెట్టి ప్రయాణం చేయడం మరింత ప్రమాదకరం. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. దీంతో ఇటువంటి సాహసాలు చేసి కన్నవారికి కడుపుకోత మిగల్చొద్దంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు.

Go Back to Shorts
Chennai
Bus tyre
youth
Viral Videos
Police
Tamil Nadu

More Telugu News