'గుండమ్మ కథ' స్ఫూర్తితో 'ఎఫ్ 2' చేశాను : అనిల్ రావిపూడి
- 'గుండమ్మకథ' అంటే ఇష్టం
- వెంకీ ఆసనానికి అద్భుతమైన రెస్పాన్స్
- సీక్వెల్ చేయాలనే ఆలోచన వుంది
'గుండమ్మ కథ'లోని సూర్యకాంతం పాత్రను ఇందులో 'ప్రగతి'తో చేయించాము. ఇక నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడిన దగ్గర నుంచి, నాపై జంధ్యాల.. ఈవీవీ సత్యనారాయణ .. ఎస్వీ కృష్ణారెడ్డి ప్రభావం వుంది. వాళ్ల తరహాలో హాయిగా నవ్వించే సినిమాలు తీయాలని అనుకుంటూ ఉండేవాడిని. 'ఎఫ్ 2' సినిమా ద్వారా కొంతవరకూ ప్రయత్నించగలిగాను. వెంకీ ఆసనానికి థియేటర్స్ లో వస్తోన్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా వుంది" అని చెప్పుకొచ్చారు.