కుక్క అరుపుతో భయపడిన యువకుడు... భవనంపై నుంచి పడి మృతి!
- ఇంటి పైకెక్కి పతంగులు ఎగురవేస్తున్న యువకుడు
- అరుచుకుంటూ పైకి ఎక్కి వచ్చిన శునకం
- అదుపుతప్పి కిందపడి తీవ్రగాయంతో మరణం
నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో, ఇంటి యజమానికి చెందిన పెంపుడు కుక్క, పై అంతస్తు నుంచి వినిపిస్తున్న అల్లర్లకు బెదిరి అరుస్తూ, రెండో అంతస్తుపైకి చేరింది. అది ఎక్కడ కరుస్తుందోనన్న కంగారులో ఖలీద్ అదుపు తప్పి భవనం పైనుంచి పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.