Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రతి ఆఫర్ ని ఒప్పుకోనంటున్న తమన్నా
  • రెండో షెడ్యూల్ లోకి 'ఆర్ ఆర్ ఆర్'
  • 'ముద్ర' అప్ డేట్ చెప్పిన నిఖిల్  
*  'వచ్చిన ప్రతి సినిమానీ ఒప్పుకోవడం లేదు' అంటోంది కథానాయిక తమన్నా. 'మొదటి నుంచీ కూడా నేను ఇదే ఫాలో అవుతున్నాను. వచ్చిన వాటిలో మంచివి ఎంచుకుంటున్నాను. ఒప్పుకోని వాటిలో కొన్ని హిట్టయ్యాయి, కొన్ని ఫ్లాపయ్యాయి. అందుకు నేను బాధపడను. ఒక ఆఫర్ వచ్చినప్పుడు నా మనసుకు నచ్చితే ఆ సినిమా చేసేస్తాను.. అంతే' అని చెప్పింది.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ ఈ నెల 21 నుంచి జరుగుతుంది. హైదరాబాదులో వేసిన భారీ సెట్స్ లో ఈ షూటింగ్ నిర్వహిస్తారు.
*  నిఖిల్ హీరోగా నటిస్తున్న 'ముద్ర' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక ఐదు రోజుల టాకీ పార్ట్ షూటింగ్ మిగిలివుంది. దీనిని త్వరలోనే పూర్తిచేసి, రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని హీరో నిఖిల్ పేర్కొన్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది.
Thamanna
NTR
Charan
Rajamouli
Nikhil

More Telugu News