వైసీపీలోకి దగ్గుబాటి.. త్వరలోనే చేరిక.. పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే?
- అతి త్వరలోనే వైసీపీ తీర్థం
- కుమారుడు హితేశ్కు పర్చూరు టికెట్
- వైసీపీ ఫ్లెక్సీలపై హితేశ్ ఫొటోలు
సంక్రాంత్రి శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై హితేశ్, వెంకటేశ్వరరావు ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇవి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. భర్త, కుమారుడు వైసీపీలో చేరినా పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉంటారని చెబుతున్నారు. వైసీపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై దగ్గుబాటిని మీడియా ప్రశ్నించినప్పుడు సమయం వచ్చినపుడు చెబుతానంటూ సమాధానం దాటవేశారు.