నా భార్య దగ్గరికి పాండ్యా, రాహుల్ లను రానివ్వను: హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా, రాహుల్
  • ఇప్పటికే సస్పెండై, ఇండియాకు వచ్చేసిన క్రికెటర్లు
  • తీవ్రంగా మండిపడ్డ హర్భజన్ సింగ్
'కాఫీ విత్ కరణ్'లో పాల్గొని అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తమ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్న టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సస్పెండై, ఆస్ట్రేలియాతో సిరీస్ కు దూరమై, ఇంటికి తిరిగొచ్చిన వారిపై హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. తన కుటుంబం ఉన్న చోట, ఆ చుట్టుపక్కలా పాండ్యా, రాహుల్ ఉండనివ్వబోనని అన్నాడు.

"నా పక్కన నా భార్య, కుమార్తె ఉంటే, వీరిద్దరితో నేను ప్రయాణించను. వీరు కేవలం ఒకే కోణంలో మహిళలను చూస్తారంటే, ఏమనుకోవాలి? వారి తీరు సరికాదు" అని వ్యాఖ్యానించాడు. వారి వ్యాఖ్యలను క్రికెటర్లందరికీ వర్తింప చేయవద్దని అంటూనే, వారి మాటలు మొత్తం క్రికెట్ పరువు తీశాయని అన్నాడు. ఇప్పుడు టీవీ షోలు చూస్తున్న వారంతా, హర్భజన్ కూడా ఇలాగే ఉంటాడేమో? గతంలో లక్షణ్, సచిన్ కూడా ఇలాగేనేమో? అని అనుకుంటున్నారని హర్భజన్ వ్యాఖ్యానించాడు.

టీమ్ కల్చర్ ను ప్రస్తావిస్తూ, ఇలా పరువు తీసేలా మాట్లాడే అధికారం పాండ్యాకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా బీసీసీఐ సరైన శిక్షను విధించిందని అనుకుంటున్నానని అన్నాడు.
Go Back to Shorts
Pandya
KL Rahul
Harbhajan Singh
Cricket
Coffee with Karan

More Telugu News