Anna Canteen: హిందూపురం అన్న క్యాంటీన్ లో రాసలీలల బాగోతం!

  • రాత్రివేళ వ్యభిచారం జరుగుతున్నట్టు ఆరోపణలు
  • నిన్న రాత్రి దొరికిపోయిన వాచ్ మెన్ జయరాం
  • పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ లో రాసలీలల బాగోతం బయటపడటం కలకలం రేపింది. ఈ క్యాంటీన్ లో రాత్రి వేళ వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు గతంలోనే రాగా, నిన్న రాత్రి ఇక్కడ వాచ్ మెన్ గా పనిచేసే జయరాం అనే వ్యక్తి, మరో మహిళతో ఏకాంతంగా గడుపుతుండగా, స్థానికులు చూసి పట్టుకున్నారు.

స్థానికుల సమాచారంతో మీడియా కూడా అక్కడికి చేరింది. క్యాంటీన్ మేనేజర్ కృష్ణ, జయరాంలు పొంతన లేని సమాధానాలు చెబుతూ ఉండటంతో, విషయం పోలీసులకు చేరింది. వారు ఇద్దరినీ అక్కడి నుంచి తీసుకెళ్లి, ఆపై వదిలేశారు. పోలీసులు కూడా వారిని ఏమీ విచారించక పోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Anna Canteen
Hindupuram
Anantapur District
Police

More Telugu News