ఫ్లడ్ లైట్ల వెలుగులో మినీ స్టేడియాలుగా మారిన తోటలు... సమస్తమూ అక్కడే!
- కోడి పందాలకు సర్వం సిద్ధం
- బరుల సమీపంలోనే మద్యం, ఆహారం
- అతిథుల కోసం హోటల్ గదులు
- తమ ప్రాంతానికి రావాలంటూ ఆహ్వానాలు
వచ్చీపోయే వారికి కావాల్సిన సమస్తమూ ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి. కావాల్సిన ఆహారం, తాగినంత మద్యం సరఫరాకు ఏర్పాట్లు జరిగిపోయాయి. అతిథులకు సకల మర్యాదలు చేస్తామని, తమ ప్రాంతానికి రావాలని ఇతర ప్రాంతాల్లోని పందెం రాయుళ్లకు ఆహ్వానాలు పంపారు. పందేలు కాసేవారి కోసం, తమకు సమీపంలోని పట్టణంలో హోటల్ గదులు బుక్ చేసేశారు. సంప్రదాయం పేరిట కోళ్ల పందాలకు సిద్ధమైన పందెం రాయుళ్లు, ఈ సంవత్సరం రూ. 100 కోట్లకు పైగా పందాలు కాయనున్నారని సమాచారం.