శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఇద్దరు మహిళలు ఎక్కడున్నారు?
- జనవరి 2న ఆలయంలోకి ప్రవేశించిన బిందు, కనకదుర్గ
- ఆందోళనకారుల నుంచి బెదిరింపులు
- గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయిన మహిళలు
ప్రస్తుతం వారిద్దరూ ఎక్కడున్నారో ఎలాంటి సమాచారం లేదు. అయితే గుర్తు తెలియని ప్రదేశం నుంచి వారు ఓ మీడియా సంస్థతో మాట్లాడినట్టు సమాచారం. పోలీసులపై తమకు నమ్మకం ఉందని... తమకు వారు రక్షణ కల్పిస్తారనే విశ్వాసం ఉందని వారు మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే వారం వారిద్దరూ తమ ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. జనవరి 2వ తేదీ తెల్లవారుజామున వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారు.