'కేజీఎఫ్ 2'లో రమ్యకృష్ణ .. సంజయ్ దత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కేజీఎఫ్ 2'లో రమ్యకృష్ణ .. సంజయ్ దత్

  • సూపర్ హిట్ ను కొట్టేసిన 'కేజీఎఫ్'
  • సీక్వెల్ కి జరుగుతోన్న సన్నాహాలు
  •  కొత్తగా మరికొన్ని పాత్రలు  
యశ్ హీరోగా కన్నడ .. తెలుగు .. హిందీ భాషల్లో విడుదలైన 'కేజీఎఫ్' భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు రాబడుతూ వెళుతోంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా జోరు కొనసాగుతూ ఉండగానే, సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశాడు.2వ భాగానికి సంబంధించి సంజయ్ దత్ .. రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ .. కొత్తగా క్రియేట్ చేసిన మరో పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. అయితే ఈసారి మరింత పవర్ఫుల్ గా ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్నట్టుగా చెబుతున్నారు. దుబాయ్ మాఫియాపై యశ్ చేసే ఎదురుదాడులు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. 
sanjay dutt
ramyakrishna

More Telugu News