ఐఆర్సీటీసీ ఆఫర్.. విమాన టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.50 లక్షల ప్రయాణ బీమా
- దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఉచితం
- ప్రమాదానికి గురైన వారి కుటుంబాలకు అండ
- వన్ వే లేదా రౌండ్ ట్రిప్ చేసే ప్రయాణికులకు వర్తిస్తుంది
ఐఆర్సీటీసీతో కలిసి భారతీ ఏఎక్స్ఏ జనరల్ ఇన్స్యూరెన్స్ సంయుక్తంగా ఈ బీమా కల్పించనుంది. ప్రయాణికులు ప్రమాదవశాత్తు చనిపోవడం లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఈ బీమా ఇవ్వనున్నట్టు ఐఆర్సీటీసీ తెలిపింది. బీమా ప్రీమియంను ప్రయాణికుల తరుపున ఐఆర్సీటీసీ చెల్లిస్తోంది. ఈ బీమా వన్ వే లేదా రౌండ్ ట్రిప్ చేసే ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది.