తనని ఎగతాళి చేస్తూ నటించిన కోట శ్రీనివాసరావును ఎన్టీఆర్ అభినందించారు: గుడిపూడి శ్రీహరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనని ఎగతాళి చేస్తూ నటించిన కోట శ్రీనివాసరావును ఎన్టీఆర్ అభినందించారు: గుడిపూడి శ్రీహరి

  • ఎన్టీఆర్ ను విమర్శిస్తూ సినిమాలు
  • ఒక మూవీలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్ర 
  • కోట శ్రీనివాస్ లోని నటుడినే ఎన్టీఆర్ చూశారు      
ప్రముఖ సినీ విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్రపరిశ్రమకి చాలా చేస్తానని ఎన్టీఆర్ ఒక సమావేశంలో చెప్పారు. ఆ తరువాత ఆయన ఏమీ చేయలేదనే విషయాన్ని విమర్శిస్తూ కొంతమంది వ్యంగ్యంగా కొన్ని సినిమాలు చేశారు. వాటిలో కోట శ్రీనివాసరావు చేసిన సినిమా ఒకటి.

ఎన్టీఆర్ ని విమర్శిస్తూ నిర్మించిన సినిమాలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రను చేయడం వలన, అన్నగారి కంటపడితే ఏమైనా అంటాడేమోనని భయపడుతూ ఉండేవాడు. అలా భయపడుతూ తిరుగుతూనే ఒకసారి ఎన్టీఆర్ కంటపడ్డాడు. 'చాలా బాగా చేశావయ్యా' అని ఆయన కోట శ్రీనివాసరావుని అభినందించారు. కోట శ్రీనివాసరావులోని నటుడిని ఎన్టీఆర్ చూశారు. ఎన్టీఆర్ ఎంతటి సంస్కారవంతుడు అనడానికి ఈ ఒక్క మాట చాలు" అని అన్నారు.     
gudipoodi

More Telugu News