చేతికి గాయం కారణంగా ‘రోజా’ చిత్రాన్ని వదులుకున్నా: వెంకటేష్
- ఏం జరిగినా మన మంచికే
- దాని గురించి నేనెప్పుడూ బాధపడలేదు
- ‘సుందరకాండ’ వంటి చిత్రాలెన్నో చేశాను
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' సినిమాలో వాస్తవానికి తాను నటించాల్సిందని వెంకీ చెప్పారు. ‘‘రోజా’ సినిమాను నేను చేయాల్సింది. కానీ ఆ సమయంలో చేతికి గాయం కావడంతో చేయలేకపోయా. దాని గురించి నేనెప్పుడూ బాధ పడలేదు. ఆ సినిమా చేయలేకపోయినా ‘సుందరకాండ’ వంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో చేశాను. ఏం జరిగినా మన మంచికే అనుకుంటాను’’ అని వెంకీ తెలిపారు.