Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘నిన్ను నమ్మం బాబూ..’ అని రైతులు అంటున్నారు: వైసీపీ అధినేత జగన్

  • రెయిన్ గన్స్ తో కరవును పారద్రోలారట
  • చంద్రబాబును రైతులు నమ్మడం లేదు
  • ఏపీలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ చేబట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఈ సందర్బంగా జగన్ ఆవిష్కరించారు. అనంతరం, స్థానిక పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘నిన్ను నమ్మం బాబూ..’ అని రైతులు అంటున్నారని విమర్శించారు. రైతులకు రెయిన్ గన్స్ ఇచ్చినట్టు డ్రామాలాడారని, రెయిన్స్ గన్స్ తో కరవును పారద్రోలానని చెప్పుకుంటున్న చంద్రబాబును రైతన్నలు నమ్మడం లేదని అన్నారు. అందుకే ఈ బాబును నమ్మమంటే నమ్మమని రైతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని, నాబార్డు నివేదిక ప్రకారం ఏపీ రైతులు అప్పుల్లో రెండో స్థానంలో ఉన్నారని అన్నారు. ఏపీలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, ఎక్కడా కొనుగోలు కేంద్రాలను తెరవలేదని, దళారీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1750 కానీ, వెయ్యి రూపాయలు కూడా రైతుకు రాని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ఉద్దానం, పలాసలో జీడిపప్పు ప్రసిద్ధి అని, రైతుల దగ్గర జీడిపప్పు కేజీ రూ.650కు కొనుగోలు చేసి, ఇదే జీడిపప్పును హెరిటేజ్ లో కిలో రూ.1180కి విక్రయిస్తున్నారని విమర్శించారు.
YSRCP
jagan
srikakulam
ichhapuram

More Telugu News