Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ సినిమా కోసం మురుగదాస్ ఇంట్రెస్టింగ్ టైటిల్

  • రజనీ కథానాయకుడిగా 'పేట' 
  • తెలుగు .. తమిళ భాషల్లో రేపు విడుదల 
  • మురుగదాస్ తో 'నర్కాలి'       
రజనీకాంత్ తన దూకుడును ఎంతమాత్రం తగ్గించడం లేదు. వరుస సినిమాలు చేయడంలో ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. 'కబాలి'.. 'కాలా' .. '2.ఓ' సినిమాలను వరుసగా థియేటర్లకు తీసుకొచ్చిన ఆయన, రేపు 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ కంటెంట్ తో .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఈ నేపథ్యంలో రజనీ తన తదుపరి సినిమాను మురుగదాస్ తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తిచేసిన మురుగదాస్, 'నర్కాలి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. తమిళంలో 'నర్కాలి' అంటే 'కుర్చీ' అని అర్థం. దాంతో రజనీతో మురుగదాస్ రూపొందించే సినిమా కూడా పొలిటికల్ డ్రామానే అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. 
rajani
murugadoss

More Telugu News