సొంత కష్టంతోనే ఏపీని అభివృద్ధి చేసుకుంటున్నాం.. ఈ విషయంలో రాజీపడం!: చంద్రబాబు
- 13 జిల్లాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాం
- కర్నూలులో పలు కార్యక్రమాలు ప్రారంభించాం
- జన్మభూమి టెలీకాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం వెల్లడి
అమరావతిలో ఈరోజు కలెక్టర్లు, నోడల్ అధికారులతో జన్మభూమి 8వ రోజు నిర్వహణపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు గ్రామ సభల్లో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పించడంపై ప్రధానంగా చర్చించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిన్న కర్నూలు పర్యటన సందర్భంగా పలు పరిశ్రమలతో పాటు ఓ ఆసుపత్రిని సైతం ప్రారంభించామని గుర్తుచేశారు. ఏపీ అభివృద్ధి విషయంలోరాజీ పడకుండా ముందుకు దూసుకుపోతున్నామని స్పష్టం చేశారు.