'ఎన్టీఆర్' సినిమాకి పాజిటివ్ రివ్యూలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎన్టీఆర్' సినిమాకి పాజిటివ్ రివ్యూలు!

  • నేడు విడుదలైన 'ఎన్టీఆర్ - కథానాయకుడు'
  • సగటు సినీ అభిమానికి కనువిందు చేసేలా చిత్రం
  • అచ్చం ఎన్టీఆర్ మాదిరే బాలయ్య కనిపించాడంటున్న ఫ్యాన్స్
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్' ఈ ఉదయం థియేటర్లను తాకగా, తొలి రివ్యూలు సినిమా చాలా బాగుందని వస్తున్నాయి. ఈ సినిమాకు సుమారు రూ. 70 కోట్ల బిజినెస్ జరుగగా, అంతకుమించి కలెక్షన్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ట్వీట్లను చూస్తుంటే, ఇది నందమూరి అభిమానులకే కాకుండా, సగటు సినీ ప్రేక్షకుడికి కూడా కనువిందు చేసేలా ఉంది.

బాలకృష్ణ చాలా సన్నివేశాల్లో తన తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే కనిపించాడని, ఆ క్రెడిటంతా దర్శకుడు క్రిష్ దేనని అంటున్నారు. సినిమాలో వచ్చే దివిసీమ ఉప్పెన ఎపిసోడ్, క్లైమాక్స్‌ లో తాను తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పే సీన్ అద్భుతమని సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. ఇక తనను లంచం అడిగిన అధికారితో బాలయ్య మాట్లాడే మాటలు చప్పట్లు కొట్టించాయని ట్వీట్లు వచ్చాయి. క్లైమాక్స్ లో నారా చంద్రబాబునాయుడిగా కనిపించే రానా కూడా అలరించాడట.

ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ అనడం కన్నా బసవతారకం బయోపిక్ అనవచ్చని కూడా ట్వీట్లు వచ్చాయి. అక్కినేని, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న స్నేహబంధం, వారిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు అద్భుతమని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, నిడివి ఎక్కువగా ఉందని, ఎన్టీఆర్ గెటప్స్ చాలా ఎక్కువైపోయాయని కూడా కొన్ని ట్వీట్లు వచ్చాయి.
NTR
Balakrishna
New Movie
Twitter
Krish

More Telugu News