జగన్ కు రాజీనామా లేఖ పంపిన ఆదిశేషగిరిరావు.. త్వరలోనే టీడీపీలో చేరే ఛాన్స్!
- తెనాలి అసెంబ్లీ టికెట్ కోరిన ఆదిశేషగిరిరావు
- విజయవాడ పార్లమెంటు సీటును సూచించిన జగన్
- సంక్రాంతి తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న నేత
ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబుకు కూడా బంధువైన ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరే అవకాశముందని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి తెదేపాలో చేరడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.