తక్కువ బ్రేక్‌ఫాస్ట్ తింటే లావు తగ్గొచ్చు
ఉదయం తీసుకునే అల్పాహారాన్ని వీలైనంత తగ్గిస్తే గనుక.. బరువు తగ్గడానికి అది ఎంతో ఉపకరిస్తుందని తాజా అధ్యయనాలు తేలుస్తున్నాయి. ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మోతాదు తగ్గించడంతో పాటు... దాన్ని పూరించడానికి ఆ తర్వాతి రోజులో అధిక కేలరీలు తీసుకోకుండా ఉండే వారు సులభంగా బరువు తగ్గుతారని తేలుతోంది. అదిక బరువు ఉన్న 33 మందికి తృణధాన్యాలు, గుడ్లు, హాం, బత్తాయి రసం వంటివాటిని పరిశోధకులు ప్రతిరోజూ అందించారు.
వీరిలో కొందరికి క్రమంగా బ్రేక్‌ఫాస్ట్ మోతాదు తగ్గిస్తూ.. ఆ మిగిలిన రోజుల్లో వారు తీసుకునే ఆహారంలో కేలరీలను కూడా లెక్కిస్తూ వచ్చారు. భోజన అలవాట్ల ప్రభావం.. అధిక బరువుపై ఏమైనా ఉంటుందేమో గమనించే ప్రయత్నం చేశారు. మిగిలిన రోజులో తీసుకునే ఆహారం పరిమాణం మీద బ్రేక్‌ఫాస్ట్ మోతాదు తగ్గించడం అనేది పెద్ద ప్రభావం చూపించడంలేదు.