వేరే భాషా చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు: తేల్చి చెప్పిన దిల్ రాజు

  • 18న విడుదల చేసుకోవచ్చుగా
  • వివాదాస్పద వ్యాఖ్యలతో నోరుజారితే మేమూ విమర్శిస్తాం
  • సినిమా మీద ఇష్టంతో ఈ రంగంలో ఉన్నా
  • మూడు సినిమాలకు థియేటర్లను సర్దేశామన్న దిల్ రాజు
తెలుగు సినిమాలను తగ్గించుకుని వేరే భాషా చిత్రాలకు థియేటర్లను ఇచ్చే పరిస్థితి లేదని దిల్ రాజు తేల్చి చెప్పారు. 'పేట' సినిమాను 18వ తేదీన విడుదల చేస్తే, రెండు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయని, దీన్ని ఆలోచించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరుజారితే, తామూ విమర్శలకు దిగగలమని హెచ్చరించారు. ఇక్కడ తాను చేస్తున్నది వ్యాపారమేనని, డిస్ట్రిబ్యూషన్ లో ఎంతో నష్టపోయానని, అయినా, సినిమా మీద ఉన్న ఇష్టంతోనే ఈ రంగంలో ఉన్నానని అన్నారు. తనకు ఎవరిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలని లేదని, ఆరు నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకు థియేటర్లు ఇవ్వాలా? వద్దా? అని అడిగారు. మూడు క్రేజీ సినిమాలకు సినిమాహాళ్లను ఇప్పటికే సర్దామని, ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు.
Go Back to Shorts
Peta
Dil Raju
Theaters
Tollywood
Andhra Pradesh
Telangana

More Telugu News