తెరపై కూడా రణ్ వీర్ భార్యగా దీపిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెరపై కూడా రణ్ వీర్ భార్యగా దీపిక

  • తెరపైకి కపిల్ దేవ్ బయోపిక్
  • 1983 నాటి విజయమే ప్రధానాంశం
  • కబీర్ ఖాన్ దర్శకుడిగా '83'   
రణ్ వీర్ సింగ్ .. దీపిక పదుకొనె ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహమైన తరువాత ఈ జంట వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందోనని అంతా అనుకున్నారు. ఆ సమయం చాలా త్వరగానే వచ్చే అవకాశం ఉందనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. హిందీలో కపిల్ దేవ్ బయోపిక్ ను తెరపైకి తీసుకెళ్లడానికి దర్శకుడు కబీర్ ఖాన్ సన్నాహాలు చేస్తున్నాడు.

1983లో టీమ్ ఇండియా ప్రపంచ కప్ సాధించడంలో కపిల్ దేవ్ ప్రధానమైన పాత్రను పోషించారు. ఆ విజయాన్ని ప్రధాన అంశంగా తీసుకుని ఆయన బయోపిక్ ను నిర్మిస్తున్నారు. '83' అనే టైటిల్ ను ఖరారు చేసిన ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం రణ్ వీర్ ను ఎంపిక చేసుకున్నారు. కపిల్ దేవ్ భార్య పాత్ర 'రోమి భాటియా' పాత్ర కోసం దీపికను సంప్రదిస్తున్నారు.

కపిల్ విజయసారథిగా నిలిచిన ఆ సమయంలో ఆయన శ్రీమతి స్టేడియంలోనే ఉన్నారు. విజయం సాధించాక ఆమె ఎంతో భావోద్వేగానికి లోనయ్యారట. ఆ పాత్రలో దీపిక అయితేనే కరెక్ట్ అని చర్చలు  జరుపుతున్నారు. ఆమె ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మరింత పెరిగిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
ranveer
deepika

More Telugu News