ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ!

  • ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించడంపై హర్షం
  • ప్రజలకు మరింత చేరువవుతామని వ్యాఖ్య
  • ఆరోగ్యకరమైన చర్చ కోరుకుంటున్నట్లు వెల్లడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ట్విట్టర్ లో ఖాతాను ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా బొత్స వెల్లడించారు.

ఈరోజు ఉదయం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ.. ‘ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించడం, మీ అందరితోనూ అభిప్రాయాలను పంచుకునే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ప్రజలకు మరింత చేరువయ్యే విషయంలో.. ఈ వేదికపై జరిగే ఆరోగ్యకరమైన చర్చ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరి ఆదరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
bosta
satyanarayana
Twitter
Social Media
account

More Telugu News