25 ఏళ్ల మాజీ అందాల సుందరిని పెళ్లాడినట్టు వార్తలు.. పదవీ త్యాగం చేసిన 49 ఏళ్ల మలేషియా రాజు
- మాస్కో అందాల భామ ఒక్సానాను పెళ్లాడినట్టు రూమర్లు
- రాజు పదవీ త్యాగంతో కలకలం
- కారణం చెప్పని రాజ ప్రాసాదం
15వ రాజుగా ముహమ్మద్ తన పదవికి రాజీనామా సమర్పించారని, ఆరో తేదీ నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు నేషనల్ ప్యాలెస్ ప్రకటించింది. డిసెంబరు 2016లో ముహమ్మద్ సింహాసనాన్ని అధిష్ఠించారు. కాగా, వైద్య చికిత్స నిమిత్తం నవంబరు నుంచి ఆయన సెలవులో ఉన్నారు. కాగా, మాజీ అందాల సుందరి ఒక్సానాను రాజు పెళ్లాడినట్టు వస్తున్న వార్తలపై రాజ ప్రతినిధుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి వివరణ లేదు.