ఒడిశా యువ నటి నికిత మృతి!
- టెర్రస్ పైనుంచి పడి తీవ్ర గాయాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- నటికి ఆరు నెలల కుమార్తె
కిందపడి తీవ్ర గాయాలపాలైన నికితను తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం కటక్‌లోని ఎస్సీబీ ఆసుపత్రికి తరలించారు. అక్కడామె పరిస్థితి మరింత విషమించడంతో మరోమారు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ మరణించింది.
‘చోరీ చోరీ మానా చోరీ’, ‘మా రా పనతకాని’, ‘స్మైల్ ప్లీజ్’ వంటి సినిమాల్లోనూ నికిత నటించింది. ఆమెకు 2016లో గోపాల్‌పూర్‌కు చెందిన లిపన్ సాహుతో కటక్‌లో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమార్తె ఉంది. అయితే, ఇటీవల ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.