Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పక్కింటిలో ఉంటున్న యువతితో ప్రేమలో పడిన తమిళ సినిమా నటుడు.. ఇద్దరూ పరారైన వైనం!

  • 'పయపుళై' సినిమాలో హీరో  
  • విడాకులు తీసుకున్నానని నమ్మబలికిన నటుడు 
  • పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జంట
సినిమాల్లో నటించి స్ఫూర్తి పొందాడో, ఏమో ఓ యువ నటుడు మాత్రం అచ్చం అలాగే ప్రవర్తించాడు. వివాహమై భార్య, పిల్లలు ఉన్నప్పటికీ పక్కింటి యువతితో ప్రేమలో పడ్డాడు. అమ్మాయి తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన శివ సినిమాల్లో నటిస్తుంటాడు. ఇతను హీరోగా 'పయపుళై' అనే సినిమా వచ్చింది. అయితే ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ అతను జీవితం గడుపుతున్నాడు. ఇతను రామావరం ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో పక్కింటిలో ఉండే ఓ యువతితో శివకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. తనకు ఇప్పటికే పెళ్లయిందనీ, విడాకులు తీసుకున్నానని నమ్మబలికిన శివ.. యువతిని తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు.

కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గాలింపును తీవ్రం చేశారు. తమ గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న ఈ జంట పోలీసుల ముందు లొంగిపోయింది. కాగా, తన భార్యకు విడాకులు ఇచ్చి యువతిని పెళ్లి చేసుకుంటానని శివ ఈ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. కాగా, యువతి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించిన అధికారులు కుమార్తెను వారికి అప్పగించారు.
Tamilnadu
ELOPE
COUPLE
ALREADY MARRIED
Police

More Telugu News