చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు.. సీఎం ఫైర్
- నాలుగు రోజులకు కుదించుకోవాలని ఆంక్షలు
- ఐదుగురికి మించి వెళ్లొద్దన్న కేంద్రం
- మరోమారు అనుమతి కోరాలన్న సీఎం
కేంద్రం ఆంక్షలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అనుమతి కోరాలంటూ సీఎంవోను ఆదేశించారు. నిజానికి చంద్రబాబు ప్రతి ఏడాది 14-15 మందితో దావోస్లో పర్యటిస్తారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో పాల్గొంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పర్యటనకు సిద్ధమవుతుండగా కేంద్రం ఆంక్షలు విధించింది.