కట్టుకున్న భర్తే ఫోన్ లో వేధిస్తుంటే... తట్టుకోలేక యువతి ఆత్మహత్య!
- మూడేళ్ల క్రితం సోనిక, ఉదయ్ వివాహం
- ఉద్యోగాన్ని వదిలేయడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన సోనిక
- నిత్యమూ వేధిస్తుంటే మనస్తాపంతో ఆత్మహత్య
కొన్నాళ్లకు ఉదయ్ ఉద్యోగాన్ని వదిలివేయడంతో, ఇల్లు జరగడం కష్టంకాగా, సోనిక తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఫోన్ చేసి మాట్లాడుతున్న ఉదయ్, నిత్యమూ ఆమెను వేధించసాగాడు. వారిద్దరి మధ్యా ఘర్షణ జరుగుతుండేది. భర్త సూటిపోటి మాటలతో మనస్తాపానికి గురైన ఆమె, తన బంధువులను కలిసి వస్తానని చెప్పి, ఓ అపార్ట్ మెంట్ కు వెళ్లి, అక్కడి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని సోనిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.