తెలంగాణలో మందుబాబులు పెరిగారు.. దక్షిణాదిలోనే అత్యధిక మద్యం అమ్మకాలు!
- గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతానికి పైగా పెరిగిన అమ్మకాలు
- ఆంధ్రప్రదేశ్ లో 19 శాతం పెరిగిన విక్రయాలు
- బీర్ కు అత్యధిక డిమాండ్ కూడా తెలంగాణలోనే
ఇక తెలంగాణలో బీర్ లకు అత్యధిక డిమాండ్ ఉందని కూడా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 302.84 లక్షల బీర్ కేసులు తెలంగాణలో అమ్ముడవగా, ఏపీలో 169 లక్షల బీర్ కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక డబ్బు విషయానికి వస్తే, ఏపీలో మొత్తం రూ. 9,720 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, తెలంగాణలో రూ. 11,894 కోట్ల అమ్మకాలు సాగాయి. కేరళలో రూ. 8,357 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయి. ఇదిలావుండగా, డిసెంబర్ 31 రాత్రి ఏపీలో రూ. 118 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగగా, తెలంగాణలో రూ. 133 కోట్ల విలువైన అమ్మకాలు సాగాయి.