మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
- మాస్ హీరోగా మంచి గుర్తింపు
- దాగుడుమూతలాడుతోన్న సక్సెస్
- త్వరలోనే పట్టాలపైకి కొత్త ప్రాజెక్టు
ఈ రోజున బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్తప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ .. కోనేరు హవీష్ లక్ష్మణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. కొత్త లుక్ తో ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడట. కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.