వారి బర్త్ డే.. హ్యాపీ న్యూ ఇయర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారి బర్త్ డే.. హ్యాపీ న్యూ ఇయర్!

  • న్యూ ఇయర్ రోజున జననాలు 
  • ప్రపంచ వ్యాప్తంగా 3,95,000 మంది జన్మించారు 
  • ఇండియాలో 69944 మంది జననం
జనవరి ఫస్ట్!
ప్రపంచ వ్యాప్తంగా ఈ తేదీకున్న ప్రాముఖ్యత తెలిసిందే. నూతన సంవత్సరంకి తొలి రోజు కావడంతో దానికి ఎంతో ప్రాధాన్యత. తమ కొత్త పనులకి ఆ రోజే శ్రీకారం చుట్టాలని చాలా మంది భావిస్తారు. అలాగే తమ బిడ్డ ఆ రోజే ఈ భూమిపైకి రావాలని నెలలు నిండిన పలువురు గర్భిణులు కూడా కోరుకుంటారు. ఆ విధంగా ఈ ఏడాది జనవరి ఒకటిన పుట్టిన పిల్లల విషయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3,95,000 మంది పిల్లలు ఆ రోజున అమ్మ కడుపు నుంచి ఈ భూమ్మీదకు వచ్చి కళ్లు తెరిచారు.

ఇక వీరిలో అగ్రతాంబూలం ఇండియాదే. భారత్ లో 69,944 మంది నిన్న జన్మించినట్టు నమోదు అయిందట. ఇక భారత్ తర్వాత చైనాలో 44,940, నైజీరియాలో 25,685, పాకిస్థాన్ లో 15,112, ఇండోనేషియాలో 13,256, అమెరికాలో 11,086, కాంగోలో 10,053, బంగ్లాదేశ్ లో 8428 మంది బేబీలు జన్మించినట్టు అధికారికంగా నమోదయింది. ఇక 2019 ప్రవేశిస్తున్న తొలి క్షణాలలో జననాలు ఫిజీలో నమోదైతే, చివరి క్షణాల నమోదు అమెరికాలో జరిగింది. ఐక్య రాజ్యసమితికి చెందిన యునిసెఫ్ ఈ గణాంకాలను ప్రకటించింది.   
New Year
Baby
India
China
US

More Telugu News