మీ ప్రవర్తన బాగోలేదన్న నెటిజన్‌కి రష్మి ఘాటు రిప్లై

  • దురుసుగా, పొగరుగా ప్రవర్తించింది
  • సౌమ్యంగా.. మంచిగా నడుచుకో
  • భవిష్యత్తుకు మంచిది కాదు
ప్రముఖ యాంకర్ రష్మి... ఓ నెటిజన్‌కి ఘాటు రిప్లై ఇచ్చింది. ఓ నెటిజన్ రష్మిని ఎయిర్‌పోర్టులో కలిశారట. ఆమె దురుసుగా, పొగరుగా ప్రవర్తించిందట. దీనిపై ఆ నెటిజన్ ఆమెకు ట్వీట్ చేశారు. ‘నిన్న విమానాశ్రయంలో రష్మిని కలిశా. ఆమె ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు మంచిది కాదు. రష్మి.. సౌమ్యంగా ఉండి, మంచిగా నడుచుకో. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని నెటిజన్‌ ట్వీట్‌ చేశారు.

దీనికి సమాధానంగా రష్మి.. ‘నాకు 24 గంటలుగా నిద్రలేదు. మూడు విమానాలు మారాను. అందుకే అంత దురుసుగా, పొగరుగా ప్రవర్తించి ఉంటాను. నా కెరీర్‌ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ బాగుంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపింది.
Go Back to Shorts
Rashmi
Netizen
Twitter
Airport

More Telugu News